Type Here to Get Search Results !

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:ఉప సర్పంచ్ కాస యాకయ్య.

యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి.



(నమస్తే న్యూస్, నర్సింహులపేట, ఏప్రిల్-03)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా గుర్తింపు పొందిన దొడ్డి కొమురయ్య జయంతిని నర్సింహులపేటలో ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన 99వ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన ఆయన జీవితం యువతకు మార్గదర్శకమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి కాస యాకయ్య యాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రేఖ అనిల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ మండలాధ్యక్షుడు సూరబోయిన సతీష్ యాదవ్, హామాలీ సంఘం మండలాధ్యక్షుడు సూరబోయిన మల్లయ్య యాదవ్, యాదవ సంఘ నాయకులు రేఖ శ్రీను యాదవ్, తండ యాకయ్య యాదవ్, సూరబోయిన వీరన్న యాదవ్, వీరబోయిన అశోక్ యాదవ్, బోగి అనిల్, సమ్మెట రమేష్, భూక్య రెడ్యా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.