నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్పి మండల అధ్యక్షులు కొండ వెంకన్న.

(నమస్తే న్యూస్, దంతాలపల్లి, ఏప్రిల్ 02)
దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలు ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉడుగుల ఐలయ్య యాదవ్–మంజుల దంపతుల ఏకైక కుమార్తె సమత వివాహం మద్దిరాల గ్రామానికి చెందిన పాక లింగయ్య–మల్లికాంబ దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్‌తో గురువారం సంప్రదాయబద్ధంగా మద్దిరాల మండల కేంద్రంలో మధు గార్డెన్స్ లో నిర్వహించబడింది. బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో వేడుక వైభవంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్పీ దంతాలపల్లి మండల అధ్యక్షుడు కొండా వెంకన్న యాదవ్ నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వధూవరులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఐలయ్య యాదవ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబానికి మరింత శ్రేయస్సు కలగాలని అభిలషించారు.
ఈ వివాహ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మీడియా ప్రతినిధులు విజయ్, మురళి, నరేందర్, నిరంజన్, మంగి సంపత్ తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలో సాంప్రదాయ కార్యక్రమాలు ఆకట్టుకోగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
