Type Here to Get Search Results !

అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన వస్త్రం తండా సర్పంచ్ లూనావత్ జ్యోతి.

అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన వస్త్రం తండా సర్పంచ్  లూనావత్ జ్యోతి.



(నమస్తే న్యూస్,నర్సింహులపేట, ఏప్రిల్ 22)అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణపై ప్రభుత్వం సర్పంచులకు కల్పించిన అధికారంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రం తండా సర్పంచ్ లూనావత్ జ్యోతి,సూపెర్వైసోర్ మిడత పల్లి శ్రీలత మంగళవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా పోషకాహార నిల్వలను క్షుణ్ణంగా  పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ బాలింతలు,చిన్నారులు, గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న ఫీడింగ్ సరైన సమయంలో అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రభుత్వం సరఫరా చేసే బలవర్ధకమైన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమయ పాలన పాటించి,మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం లబ్ధిదారులకు అందించాలని, హెచ్ ఆర్ ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొని ఎగ్స్ మీద స్టాంప్ గురించి వివరించారు.సరుకులు భద్రపరచుకోవాలని,అంగన్వాడి కేంద్రంలోపల,బయట పరిసరాలు శుభ్రత పాటించాలి అని..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ  టీచర్,ఆయా,గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.