కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డా.రామచంద్రునాయక్.
(నర్సింహులపేట,ఏప్రిల్ 22,నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం మండలం వంతడుపుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని,మధ్యవర్తుల సమస్యలు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు.రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు.రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని,గ్రామాల అభివృద్ధికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ బాబు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినుకల రమేష్, గ్రామ సర్పంచ్ పెదమాముల యాదయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బాబురావు,సర్పంచ్ డాక్టర్ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరోజు రాజశేఖర్, ఏవో వినయ్ కుమార్, మహిళలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

