Type Here to Get Search Results !

విద్య సదస్సును జయప్రదం చేయాలి. — జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి.

విద్య సదస్సును జయప్రదం చేయాలి.
—జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి.




 (నమస్తే న్యూస్,నర్సింహులపేట, ఏప్రిల్ 22)

టిపిటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ పాఠశాలలో మండల విద్యాధికారి రామ్మోహన్ రావు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు రాష్ట్ర విద్యా సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు క్రాంతికుమార్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు,సభ్యులు తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.