Type Here to Get Search Results !

రోడ్డు భద్రత పై అవగాహన పెంపొందించుకోవాలి-ఎస్సై సురేష్.

రోడ్డు భద్రత మరియు డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు.


సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై ఎం.సురేష్.

(నమస్తే న్యూస్,నర్సింహులపేట,మార్చి 24)
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని నర్సింహులపేట ఎస్సై ఎమ్. సురేష్ సూచించారు.ఈ సందర్భంగా  నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై ఎమ్. సురేష్ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.అదేవిధంగా, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామ స్థాయిలో అప్రమత్తత అవసరమని తెలిపారు.ఇక సైబర్ క్రైమ్‌లపై కూడా అవగాహన కల్పిస్తూ, తెలియని లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీలు షేర్ చేయకూడదని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.