Type Here to Get Search Results !

చెక్ డ్యాముల పునరుద్ధరణ కు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి-డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్..

•చెక్ డ్యాముల పునరుద్ధరణ కు ప్రభుత్వం  చర్యలు చేపట్టాలి. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్  రామచంద్రునాయక్.


•నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రామచంద్రునాయక్.



(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్,మార్చి 24)

డోర్నకల్ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యలు, సాగునీటి కొరత, చెక్ డ్యాముల పునరుద్ధరణ కు ప్రభుత్వం  చర్యలు చేపట్టేవిదంగా కృషిచేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అసెంబ్లీ చాంబర్లో ఎమ్మెల్యే డాక్టర్  రామచంద్రనాయక్,  ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యలు, సాగునీటి కొరత, చెక్ డ్యాముల పునరుద్ధరణ అవసరం వంటి కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, చెక్ డ్యాముల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల మట్టాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి,సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డోర్నకల్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ స్పష్టం చేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.