Type Here to Get Search Results !

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం-ఎస్సై సురేష్.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు  అవసరం: ఎస్సై సురేష్




(నమస్తే న్యూస్, నర్సింహులపేట, మార్చి 27)

గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను సులభంగా గుర్తించవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని  నరసింహులపేట ఎస్ఐ సురేష్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 7 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ మాలోతు బాలు నాయక్ ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలైంది.

గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను సులభంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సురేష్, గ్రామ సర్పంచ్ బాలునాయక్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఇక ఇతర గ్రామాలు కూడా వంతాడుపుల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ భద్రత కోసం ముందుకు రావాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.