దంతాలపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు.
NAMASTHE NEWSMarch 25, 2026
0
దంతాలపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
రోడ్డు ప్రమాదాల నివారణకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం.
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, మార్చి 25) మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఎస్ఐ పిల్లల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, డ్రైవర్లు స్పష్టంగా చూడగలిగేలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వాహనదారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక డ్రైవర్లు అభినందించారు. కార్యక్రమంలో సీఐ గణేష్, హెడ్ కానిస్టేబుల్ జన్నయ్య, పోలీస్ సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.