Type Here to Get Search Results !

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రిపోర్టర్.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రిపోర్టర్. 


పరామర్శించిన టి.అర్.పి దంతాలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొండా వెంకన్న.




(నమస్తే న్యూస్, దంతాలపల్లి, మార్చి 19)

      ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మీడియా ప్రతినిధులను  ఆదుకోవాలని దంతాలపల్లి టి.ఆర్.పి మండల పార్టీ అధ్యక్షులు కొండ వెంకన్న   ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి , హనుమకొండలోనే ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డోర్నకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపోర్టర్ భూతం  రమేష్ ను, పరామర్శించారు. ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తూ , చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులతో  ఎంతోమంది రిపోర్టర్లు సతమతమవుతున్నారని , ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిపోర్టర్లు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రిపోర్టర్లకు ప్రభుత్వ సంక్షేమాలు అందడంలో ప్రాముఖ్యతను కల్పించాలని, ఆర్థిక ఇబ్బందులతో బ్రతుకు భారమైపోతున్న రిపోర్టర్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు పడిదం నరేందర్, కారు పోతుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.