నమస్తే న్యూస్ నర్సింహులపేట
నర్సింహులు పేట మండలం బక్కతండ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మాతండాలో మండల స్థాయి కబడ్డీ పోటీలను సర్పంచ్ గుగులోతు నరేష్ తో కలిసి ప్రారంభించిన మరిపెడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కబడ్డీ క్రీడ ఇరు జట్ల మధ్య గెలుపు కోసం పట్టుదలను పెంచే ఒక వ్యూహాత్మక క్రీడ అని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతా లక్షణాలను పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ వంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహద పడతాయని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు దేవేందర్, కిషన్, సురేష్ లక్ష్మాతండా యూత్ సభ్యులు శంకర్, వీరన్న, మోహన్ తదితరులు పాల్గొన్నారు


