Type Here to Get Search Results !

పెండింగ్ డీఏ ల ను చెల్లించి పిఆర్సి వెంటనే ప్రకటించాలి- టి.ఎస్.యు.టి.ఎఫ్

 పెండింగ్ డీఏ  ల ను చెల్లించి పిఆర్సి వెంటనే ప్రకటించాలి.



(నమస్తే న్యూస్,దంతాలపల్లి, నవంబర్ 22)

వెడ్డింగ్ డే లను వెంటనే చెల్లించి పిఆర్సి ప్రకటించాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ, రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో టిఎస్ యుటిఎఫ్   దంతాలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న  జిల్లా అధ్యక్షులు మురళి కృష్ణ  జిల్లా కార్యదర్శి ఎన్నికల ఇంచార్జ్ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ లో ఉన్న  డీఏ ల ను ప్రకటించి  పై.ఆర్.సి  నీ వెంటనే అమలు చేయాలని  డిమాండ్ చేశారు.   జూలై 2023 నాటికి తెలంగాణ లో రెండో పిఆర్సి అమలు చేయాల్సి ఉండగా  మేము అధికారంలోకి రాగానే పి.ఆర్.సి ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటిన ,ఇంకా పిఆర్సి ఇవ్వకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకోవాల్సింది ఉంటుందన్నారు.ఇప్పటికే మూడు సంవత్సరాలు దగ్గరకొస్తున్న సందర్భంగా పి.ఆర్.సి ఇవ్వాలని సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్  నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్య హక్కు చట్టంలో  మార్పు చేసి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఉద్యోగ ఉపాధ్యాయ పక్షాన రాష్ట్రములో ఏ సమస్య వచ్చినా  సంఘం  విద్యారంగ ఉపాధ్యాయుల పక్షాన  పోరాటం చేస్తూ ఉంటుందని, ఇలాంటి  సంఘానికి ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలని,టిఎస్ యుటిఎఫ్ బలోపేతానికి అందరూ పాటుపడాలని పిలునిచ్చారు .ఈ కార్యక్రమంలో దంతాలపల్లి మండల అధ్యక్షులు వెంకన్న, ప్రధాన కార్యదర్శి ,వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు బి పార్వతి రాథోడ్, అందె చిరంజీవి, కోశాధికారి ఆర్ విజయ్ కుమార్, మండల బాధ్యులు కే భవాని, ఎం రజిత, యు. లింగయ్య, బీ రవికుమార్, పి అనిల్, కే అనిల్, ఏ రమేష్, కే సుమతి, ఎమ్ రమేష్, డి రమేష్, రజనీకాంత్, రామ్మూర్తి, శ్రీలత, అశోక్, నరసింహుల పేట మండల బాధ్యులు వెంకటేశ్వర్లు, కే. లింగరాజు,  మరిపెడ మండల కోశాధికారి కొండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.