నమస్తే న్యూస్ దంతాలపల్లి 8
హరితహారం చెట్లు అక్రమంగా నరికివేత
పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రహదారులు,ప్రధాన సముదాయాల వద్ద చెట్లను నాటించారు.పల్లెలను పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన (ఆవెన్యూ ప్లాంట్స్) చెట్లను మండలంలోని వేములపల్లి నుండి రామానుజపురం గ్రామం వరకు ఉన్న ఆర్అండ్బి రహదారి వెంట రోడ్ల వైపు ఉన్న చెట్లను సగం వరకు నరికి వేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు, మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోడ్డు పక్కన ఉన్న చెట్లను సగం వరకు నరికి వేస్తున్న దృశ్యాలు ప్రజలకు,పర్యావరణ ప్రేమికుల కంటపడగా ఇన్ని రోజులు ఏపుగా పెరిగిన చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చాయని, పచ్చని చెట్లు లేక రోడ్డు బోసిపోయి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఆర్అండ్బి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నాటిన చెట్లను ఎవరి అనుమతులతో నరికి వేస్తున్నారని,ఎందుకు నరికి వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన చెట్లను అక్రమంగా నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు,ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



