జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ, వాహన పూజ.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 02, మహబూబాబాద్)
విజయదశమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సాయుధ దళ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు గురువారం ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. పూజ అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ, దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం పోలీసు శాఖలో ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. సమాజంలో చెడును నివారించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.అంతేకాక, ఎస్పీ తరఫున పోలీసు సిబ్బంది, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, ఎస్‌బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సీఐ సరవయ్య, ఆర్‌ఐలు అనిల్, సోములు, భాస్కర్, నాగేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.