(నమస్తే మానుకోట-కురవి)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మండలానికి చెందిన చిర్ర సునీల్ పోటీలో ఉండి నామినేషన్ ధాఖలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కురవి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు,యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు తనకు మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నాని తెలిపారు.
గత పది సంవత్సరాలనుండి కాంగ్రెస్ జెండాను తన బుజస్కంధాలపై మోస్తూ పార్టీ కష్టకాలంలోనూ జెండాను వదలకుండా ఎన్నో కేసులకు, బెదురింపులకు దడవకుండా నేడు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో రావడానికి మరియు డోర్నకల్ నియోజకవర్గం లోని కురవి మండలం నుంచి ఉమ్మడి వరంగల్ లోను భారీ మెజారిటీ తో గెలుపొందిన ప్రభుత్వం విప్ & డోర్నకల్ శాసనసభ్యులు డా:- రాంచంద్ర నాయక్ గెలుపు కోసం కురవి మండలం నుంచి నిరంతరం కస్టపడి, నేడు కురవి మండలం లోని ఎంతో మంది సీనియర్ నాయకుల మన్ననలు పొంది వారి ఆశీర్వాదం తో నేడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే తెలంగాణా రాష్ట్ర యాత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కురవి మండలం నుంచి మండల యూత్ అధ్యక్ష పదవికి పోటీ చేశానని అందరూ మీవంతుగా మండలం లోని యూత్ కాంగ్రెస్ సభ్యులు నాకు అత్యధికముగా ఓట్లు వేసినన్ను గెలిపించగలరని మనవి చేసుకున్నారు.

