నమస్తే మానుకోట(దంతాలపల్లి)
నిరుపేదలకు సీఎం రిలీప్ ఫండ్ ఓ వరమని ,పేదల అభివృద్ధి కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టునాయక్ అన్నారు.డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు జబ్బున పడితే ఆర్ధికంగా ప్రజలను ఆదుకోవడానికి సి యం సహాయనిది నుండి ప్రజలకు ఆర్ధిక సహాయం అందించండం గొప్పవరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండగాని సైదులు, అనిల్,విజయేందర్,తూర్పు తండా గ్రామ పార్టీ అధ్యక్షులు మోహన్,పె ద్దముప్పారం గ్రామ పార్టీ అధ్యక్షులు కె అంజయ్య, బిచ్య, పార్థు తదితరులు పాల్గొన్నారు.


