కుట్లో రాయి తియనొడు ఎట్లో రాయి తిస్తా అన్నాడట అట్లుంది ఈరోజు కెసిఆర్ మ్యానిపేస్టో.. ఏఐఎస్ఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ ఈ రోజు కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అన్నట్లు ఉందని అన్నారు.ధనిక రాష్టాన్ని అప్పుల రాష్టంగా మర్చి నెల జీతాలే సక్కగా ఇవ్వని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హమిలను అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వం, మళ్ళీ మాయ మాటల హామీలతో మళ్ళీ అధికారం కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు.10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని విమర్శించాడు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి వాడి ప్రాణాలను లెక్కచేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. 1200 మంది విద్యార్థి అమరవీరుల పునాదులపై పరిపాలన కొనసాగిస్తున్న ఈ కేసీఆర్ ని ఈ ఎన్నికల్లో నిరుద్యోగులంతా గద్దతించాలని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీపై ప్రక్షాళన చేయాలని అన్నారు. నోటిఫికేషన్ రద్దు కావడంతో మనస్థాపనకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అంతకుముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏది చక్కగా అమలు చేయలేదని అన్నారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే జరిగిందో నిన్నగాక మొన్న రద్దయినటువంటి గ్రూప్ టూ కి కూడా అదే జరిగిందని అన్నారు. నిరుద్యోగులారా మేలుకోండి నిరుద్యోగ తల్లిదండ్రులార కళ్ళు తెరవండి ఈ కుటుంబ పాలనకు చర్మ గీతం పాడాలని అన్నారు....
October 15, 2023
0
Tags
