ముత్యాలమ్మకు బోనాలు సమర్పంచిన గ్రామ ప్రజలు.
August 23, 2023
0
గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పాడి పంటలు అభివృద్ధి చెంది ,ఆరోగ్యం గా ఉండాలని దంతాలపల్లి గ్రామ సర్పంచ్ దర్శనాల సుశ్మిత రవింధర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా పోతరాజుల విన్యాసాల నడుమ బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంతాలపల్లి గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో ముత్యాలమ్మ తల్లికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దర్శనాల సుస్మిత రవీందర్ తో పాటుగా ఎంపీటీసీ నెమ్మది యాకన్న , ఉప సర్పంచ్ శిరీష వీరన్న వార్డు సభ్యులు సాదు సంపత్ రెడ్డి , చీకటి లింగమ్మ ఉప్పలయ్య, దర్శనాల శ్రావణ్, గోనెల జానకి రాములు, నెమ్మది యాకమ్మ , మర్రి ఉపేంద్ర, గోనెల ఉప్పలయ్య, అంకం సోమేశ్వర్, నెమ్మది నాగయ్య, బానోత్ కిషన్, నెమ్మది సరిత, ఎస్సై రమేష్ బాబు, చీకటి మహేష్ గౌడ్, దాసరి మురళి, యువ కలం రైసింగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు అశోక్, జంపన్న ఉపేందర్ ,కృష్ణారెడ్డి,కొండ లింగన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
