పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు.


మరిపెడ,జులై 15(నమస్తే న్యూస్).మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకురామ్ తండాకు చెందిన భూక్యా మంగ్ను దశదిన కర్మకు మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరయ్యారు.వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ భూక్యా శంకర్,ఉప సర్పంచ్ ఎల్లయ్య,అజ్మీర రెడ్డి,దిగజర్ల పేపర్శీ ను, పట్టాభి, శంకర్, హనుమంతు, హరిణాద్, లాలు,ఉపేందర్,మధు,మల్లయ్య,లచ్చు తదితరులు ఉన్నారు. అనంతరం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని చొక్లతండాకు చెందిన 2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను ఇంటిని కూడా నవీన్ రావు సందర్శించారు.తండాలో జరిగిన ఘర్షణలో గాయపడి మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా వారి వెంట దిగజర్ల పేపర్ శ్రీను,పానుగోత్ వెంకన్న,రేఖ వెంకటేశ్వర్లు,హతిరాం,భద్రయ్య,పవన్ ఫ్లెక్సీ,తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

