“కలెక్టర్ గారు… మీరైనా మాపై దయ చూపండి” – సీతారామ ప్రాజెక్టు బాధిత రైతుల వేడుకోలు
తిరుమలాయపాలెం జూలై 13 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలంలోని ఖమ్మం జిల్లా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. ఆకలికి తట్టుకోలేక భూములు అమ్ముకోలేదని, వందలాది మంది రైతులకు ఆహారం అందించే పంటలు పండించే భూములను ప్రభుత్వ అవసరాల కోసం ఇచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యలపై ఇప్పటికే ఆర్డీవోకు పది సార్లకుపైగా దరఖాస్తులు సమర్పించినా ఇప్పటికీ పరిష్కారం లభించలేదని రైతులు ఆరోపించారు.వివరాలలోకి వెళితే పోతుగంటి సహదేవ్ తండ్రి వీరయ్య అజ్మీర తండా గ్రామపంచాయతీ రాకాసి తండా నివాసి వృత్తి వ్యవసాయం వయసు 47 సంవత్సరాలు కులం కుమ్మరి, తిప్పారెడ్డిగూడెం రెవిన్యూ పరిధిలోగల నా భూమి సీతారామ ప్రాజెక్టు కాలువ కింద ఒక ఎకరం 20 కుంటల భూమి పోయినది అందులో ఒక బోరు గురించి పది సార్లు ప్రజావాణిలో ఫోటోలతో సహా చూపిస్తూ యదార్ధంగా గ్రహించితమే సర్వే చేసినారు సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం వల్ల తమ బావి, బోరు పూర్తిగా వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయని సహాడావ్ అనే రైతు తమ ఆవేదనను తెలిపారు.
అందుకు స్పందించిన అప్పటి అధికారులు కాలువ ప్రారంభ దశలో అనగా ఆరు సంవత్సరాల క్రితమే ఆర్డీవో తిప్పారెడ్డిగూడెం లో రైతు సదస్సు లాగా పెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అప్పుడు నేను చెప్పుకున్నాను నా బాధలు, నా సమస్యలు, అందుకు స్పందించిన అప్పటి ప్రభుత్వ అధికారులు A/74/2020 ప్రొసీడింగ్ నంబర్‌తో బావికి పైపులు మంజూరు చేసినప్పటికీ, ఆ ప్రయోజనం ఇప్పటికీ అందలేదని పేర్కొన్నారు. సంబంధిత ఏఈడీఈ అధికారిని పలుమార్లు సంప్రదించినప్పుడు తమ బావి సమస్య గురించి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.సీతారామ ప్రాజెక్టు కాలువ కింద భూములు కోల్పోయిన రైతులందరికీ తగిన నష్టపరిహారం, సాగునీటి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.

