జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నూతన అధ్యక్షుడు బత్తిని వెంకటేశం గౌడ్

మోతె, సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్ డెస్క్):
మోతె మండల ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గం గౌరవ సలహాదారు గా పోటు ఉపేందర్ రావు (ఈనాడు),గౌరవ అధ్యక్షులుగా కాంపాటి వెంకన్న (సాక్షి), అనంతల యల్లయ్య (వార్త), యూనియన్ అధ్యక్షుడు గా బత్తిని వెంకటేశం గౌడ్ (నవతెలంగాణ), ఉపాధ్యక్షులుగా జిల్లపల్లి శివకృష్ణ (ఆంధ్రప్రభ), బానోత్ విఠల్ (నినాదం) లు,ప్రధాన కార్యదర్శులుగా భానోత్ నెహ్రూ (నమస్తే తెలంగాణ), లగిశెట్టి వెంకన్న (ఆంధ్రజ్యోతి) కోశాధికారిగా కంది బండ గోపి (జ్యోతి) మరియు కార్యదర్శి గా గునగంటి నాగరాజు గౌడ్ (మన తెలంగాణ) ను ఎన్నుకున్నారు. వీరితో పాటుగా కార్యవర్గ సభ్యులుగా కారింగుల స్టాలిన్ (విశాలాంధ్ర), ఎస్.కె. పాష (దిశ), కోల రవీందర్ (డైనమిక్ న్యూస్), శ్రీకాంత్ (విశాల తెలంగాణ) నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బత్తిని వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.