- తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా
- మూలమర్రి తండ సర్పంచ్ భూక్యా జానకి రాములు నాయక్
- రూ.7 లక్షల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభం.
మరిపెడ(జులై 13నమస్తే న్యూస్).తండా ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని మూలమర్రి తండా సర్పంచ్ భూక్యా జానకి రాములు నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రి తండ గ్రామపంచాయతీలో 7 లక్షల రూపాయల నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్డును తండా సర్పంచ్ భూక్యా జానకిరాములు నాయక్ ప్రారంభించారు. గ్రామపంచాయతీలోని అన్ని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని,ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించకుండా సీసీలను నిర్మిస్తామని తెలిపారు. తండా ప్రజల సౌకర్యార్థం సైడ్ డ్రైనేజ్ కాలువల నిర్మాణం చేపడతామన్నారు.ప్రభుత్వం అందజేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చే విధంగా ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. తండా పంచాయితీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిషన్, మాజీ సర్పంచ్ జగని,కాంగ్రెస్ నాయకులు నెహ్రు నాయక్, భరత్ నాయక్, భూక్యా వేంకన్నా, నాగ వార్డ్ మెంబర్లు సోమని, అరుణ, శంకర్, కార్యదర్శి సృజనా రెడ్డి, తండా నాయకులు, ప్రజలు ఇంకా తదితరులు పాల్గొన్నారు.


