కూకట్పల్లి నియోజకవర్గంలోని వినాయక మండపాల సందర్శన
కూకట్పల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, వసంత్ నగర్, కేపీహెచ్బీ 5వ ఫేజ్, బాలాజీనగర్ రోడ్ నంబర్-3, కేపీహెచ్బీ వన్ సిటీ, కేపీహెచ్బీ 4వ ఫేజ్ ప్రాంతాల్లోని వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఆయా మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వినాయకుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





