విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచన
ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్
గ్రామ సర్పంచ్ ధారావత్ సుజాత నరసింహారావు
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 2 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం గ్రామంలోని సంక్షేమ హాస్టళ్లను ఎంపీడీవో షేక్ సిల్వర్ సాహెబ్, గ్రామ సర్పంచ్ దారావత్ సుజాత నరసింహారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికల వసతి గృహం, గిరిజన గురుకుల బాలుర వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అధికారులు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, వసతి, భోజన నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శి, రమేష్ ఏఎన్ఎం నాగలక్ష్మి ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ధరావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

