200 మందికి వైద్య పరీక్షలు నిర్వహణ.
ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించిన స్వచ్ఛవ క్యాన్సర్ కేర్ వైద్య బృందం.
క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని పర్యవేక్షించిన సర్పంచ్ మనమ్మ మహేష్, ఉప సర్పంచ్ శ్వేత సురేందర్ రెడ్డి.

నార్కట్‌పల్లి, అక్టోబర్ 2(నమస్తే న్యూస్ డెస్క్):
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామంలో రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, స్వస్తవ క్యాన్సర్ కేర్, రోటరీ క్లబ్ సహకారంతో శుక్రవారం క్యాన్సర్ అవగాహన–స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.మహిళలు, పురుషుల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్లపై వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ముఖ్యంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార, కొలొరెక్టల్ క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించేందుకు అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ పద్ధతుల గురించి వివరించారు.
ఈ శిబిరానికి సీనియర్ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డా.దూరియా నాయకత్వం వహించగా, డా. విజయేందర్ (MBBS, MD)తో స్వచ్ఛవ క్యాన్సర్ కేర్ కోఆర్డినేటర్ సరిత ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని సేవలు అందించారు.శిబిరానికి సుమారు 200 మంది హాజరై స్క్రీనింగ్ సేవలను వినియోగించుకున్నారు. ప్రజలకు క్యాన్సర్ అవగాహన, ముందస్తు గుర్తింపు ప్రాధాన్యతపై వైద్య బృందం వివరించింది.క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్, స్వస్తవ క్యాన్సర్ కేర్, రోటరీ క్లబ్ ప్రతినిధులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలుక్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలి:మండల నాయకులు సాగర్ రెడ్డి
ప్రజలు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని మండల నాయకులు సాగర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి లింగారెడ్డి, చిప్పల పల్లి సర్పంచ్ అంజి రెడ్డి అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అతిధులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే అనేక చికిత్సా అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చని తెలిపారు. శరీరంలో అనుమానాస్పద గడ్డలు, తగ్గని పుండ్లు, అసాధారణ రక్తస్రావం, 1మింగడంలో ఇబ్బంది, మలంలో రక్తం, రొమ్ములో గడ్డ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.అలాగే పొగాకు, గుట్కా, ఖైనీ, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, బరువు నియంత్రణ వంటి జీవనశైలి మార్పులతో పాటు వయస్సు, ప్రమాద కారకాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు అభినందనీయం:
సర్పంచ్ మణెమ్మ మహేష్, ఉపసర్పంచ్ శ్వేత సురేందర్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు, స్వచ్ఛభా కాన్సర్ కేర్, లెనోవా వివి క్యాన్సర్ ఆసుపత్రి వారు నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు అభినందనీయమని సర్పంచ్ మణెమ్మ మహేష్, ఉపసర్పంచ్ శ్వేత సురేందర్ రెడ్డి కొనియాడారు. సందర్భంగా చిన్న తుమ్మలగూడెంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేడు సమాజంలో క్యాన్సర్ విజృంభిస్తుందని, ప్రజలు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ప్లాస్టిక్ వాడకం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్వేత సురేందర్ రెడ్డి శిబిరాన్ని పర్యవేక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ సేవలను గ్రామస్థుల వద్దకే తీసుకురావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు శ్రీలత , సాయిరెడ్డి, బిక్షపతి, నర్సింగ్ సిబ్బంది వెంకటేష్,రాజు, దీన , గాయత్రీ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు బాతుక నరసింహ మాజీ సర్పంచ్ దాసరి రాజు, వార్డు సభ్యులు ఆవుల తిరుమలేష్, చింత పరమేష్, తిరుమల్ రెడ్డి, పరమేష్ రెడ్డి, కుమారస్వామి, శ్రీశైలం, కారోబార్ నరసింహ, నాయకులు , ఆవుల రాజమల్లు ,శ్రీనివాస్ రెడ్డి, వంగాల శ్రీను, పస్కుల శీను తదితరులు పాల్గొన్నారు.

