రామన్నపేట అక్టోబర్ 3 (నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గోషిక వెంకటేశ్వర్లు, తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ నాయకులు గుర్తించడం లేదని, అహర్నిశలు గ్రామంలో పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందించానని, అలాంటిది నాకు గ్రామ శాఖ లో న్యాయం జరగలేదని నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్న పార్టీ నాయకత్వం కొంతమందికి కొమ్ముకాస్తుందని, గతంలో శాసనసభ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీకి ధీటుగా ఎదుర్కొన్నానని ప్రతిపక్ష పార్టీ నుండి దాడి సైతం నాపై జరిగిందని, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కాంగ్రెస్ పార్టీకి నా వంతు సహాయ సహకారాలు అందించానని, అయినా ఉద్దేశపూర్వకంగా నాకు గ్రామ శాఖలో నాపై కక్ష సాధింపు చర్యలతో నన్ను రాజకీయంగా అనగదొక్కాలని ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని, గ్రామస్థాయిలో పదవులు ఉన్నవారికె పదవులు కట్టబెడుతూ నాపై రాజకీయ కుట్రలు పొందుతున్నారని, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.
