మేడిదిపల్లి శివారులో ఘటన.. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 2 ( నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలానికి చెందిన నమస్తే న్యూస్ రిపోర్టర్ బైక్ మూలమలుపు దగ్గర అదుపుతప్పి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన మేడిదిపల్లి శివారులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇనుగుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో మేడిదిపల్లి శివారులో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రిపోర్టర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

