• మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ షీలాఆర్ సాహెబ్, ఎంపీఓ షేక్ మీరా సూచనలతో అద్భుత ప్రణాళిక
- సర్పంచ్ నల్లమల్ల కీర్తి చొరవ.. క్షేత్రస్థాయి సిబ్బంది సమిష్టి కృషితోనే రికార్డు విజయం
• ఎర్రగడ్డలో నిండుకుండలా మారిన పంటకుంట.. రైతు సురేష్ పొలంలో జలకళ
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 28 (నమస్తే న్యూస్ )
ప్రభుత్వ పెద్దల మేధస్సు నుంచి పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచన.. క్షేత్రస్థాయికి చేరితే ఎలా ఉంటుందో చూడాలంటే తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ శివారుకు వెళ్లాల్సిందే. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా, దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘తెలంగాణ జలసిరి’ పథకం.. కేవలం ప్రభుత్వ జీవోలకో, కార్యాలయాల ఫైళ్లకో పరిమితం కాలేదు. మండలం మొత్తం మీద అందరికంటే ముందే, ఎక్కడా అలసత్వానికి తావివ్వకుండా యుద్ధప్రాతిపదికన ఈ పథకం కింద మొట్టమొదటి పంటకుంట (ఫామ్ పాండ్) నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడి యంత్రాంగం రికార్డు సృష్టించింది. మొన్నటివరకు వట్టిపోయిన నేల.. నిన్న కురిసిన వానకు నేడు నిండుకుండలా మారి, భూగర్భ జలాల గుండెల్లో అమృతాన్ని నింపుతోంది! కాగితాల మీద ఉండే పథకాల రాతలను దాటుకుని, రైతు పొలంలో పచ్చని పంటల గీతలను గీస్తూ ఆవిష్కృతమైన ఈ ‘జలచిత్రం’.. ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.
అధికారుల దిశాదర్శనం.. సర్పంచ్, సిబ్బంది సమిష్టి శ్రమ
ఒక పథకం ప్రకటించడం సులువే కానీ, దానిని మండలంలోనే అందరికంటే ముందే పూర్తి చేసి చూపించడం వెనుక నిరంతర పర్యవేక్షణ దాగి ఉంది. ముఖ్యంగా, తిరుమలాయపాలెం మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ సిలార్ సాహెబ్. మండల పంచాయతీ అధికారి షేక్ మీరా. ల దిశాదర్శనం, సమర్థవంతమైన సూచనల మేరకు మండల ఉపాధి హామీ యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి ఆశయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే తపనతో ఎర్రగడ్డ గ్రామ సర్పంచ్ నల్లమల్ల కీర్తి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (TA) మరియు ఉపాధి హామీ సిబ్బంది సమిష్టిగా చేతులు కలిపారు. ఎక్కడా అలసత్వానికి తావివ్వకుండా, అర్హులైన రైతును ఎంపిక చేసి, రికార్డు సమయంలో ఈ పంటకుంట నిర్మాణాన్ని పూర్తి చేశారు. కేవలం నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా, పడే ప్రతి వర్షపు చుక్కా ఇందులోకి వచ్చేలా వారు చేసిన ప్రణాళిక అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.
రైతాంగానికి నూతన ఉత్తేజం..
ఈ ఒక్క పంటకుంట సాధించిన విజయంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు సైతం తమ పొలాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వృథాగా పోయే వర్షపు నీటిని ఒడిసిపట్టి, కరవు కాలంలో పంటలకు ప్రాణం పోసే ఈ అద్భుత ప్రయోగం అన్నదాతల్లో సరికొత్త ధీమాను నింపింది. ప్రభుత్వ అద్భుతమైన విజన్‌కు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల ‘మిషన్’ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించిన తిరుమలాయపాలెం ‘జలసిరి’ పంటకుంట.. ఇప్పుడు మిగతా ప్రాంతాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.
