విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం అభినందనీయం.
యువత భవిష్యత్తుకై గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవాలి.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఆదర్శ ఉన్నత పాఠశాలలో సోమవారం ‘నిశ్శబ్దంలోంచి శబ్దిస్తూ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.నెల్లికుదురు ఆదర్శ ఉన్నత పాఠశాల తెలుగు భాషా ఉపాధ్యాయులు యెలిశాల నాగమోహన్ సంకలనంలో వెలువడిన ఈ పుస్తకాన్ని మరిపెడ ఆదర్శ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అక్తరుజ్మా ఖాన్,ఉపాధ్యాయులు నాగార్జున,నాగరాజు,వనరుల వ్యక్తులు నందిగామ జనార్ధనాచారి,కేదారి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అక్తరుజ్మా ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులతో కవితలు రాయించి,వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి,వాటిని పుస్తక రూపంలో సంకలనంగా తీసుకురావడం అభినందనీయమన్నారు.విద్యార్థుల్లో సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి ఆలోచనా శక్తి,సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.భాషాభివృద్ధితో పాటు సామాజిక చైతన్యానికి కూడా సాహిత్య కార్యక్రమాలు తోడ్పడతాయని పేర్కొన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి,వారికి రచనా వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి రచయితలను తీర్చిదిద్దవచ్చని ఉపాధ్యాయులు,వనరుల వ్యక్తులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పుస్తక సంకలనకర్త యెలిశాల నాగమోహన్ మరిపెడ ఆదర్శ ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు.విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకుని పఠనాసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మరిపెడ ఆదర్శ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


