వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 5వ వార్డులో భక్తిశ్రద్ధలతో కార్యక్రమం.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్).
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు,పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రెడ్యానాయక్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమానికి చేరుకుని గణనాథుని ఆశీస్సులు పొందడంతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు,అన్నప్రసాదం,ఇతర అవసరమైన ఏర్పాట్లు చేశారు.వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టారు.పట్టణ ప్రజలు,భక్తులు,నిర్వాహకుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా పలువురు భక్తులు నిర్వాహకులను అభినందించారు..


