జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్)
పేదరకం లో పుట్టి చిన్న వయస్సు లోనే తండ్రినీ కోల్పోయిన (బుడిగెం శ్రీలత వెంకటేశ్వర్లుల కుమారుడు) బుడిగెం సాయి వరుణ్ వెనకడుగు వేయకుండా అమ్మమ్మ అల్లి యశోద దగ్గర ఉంటూ బాల్య విద్యాభ్యాసం రఘునాథపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదివి అనంతరం ఏన్కూర్ గురుకులంలో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి 2025- 2026 ఎంసెట్ లో 2088 ర్యాంక్ తో వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS లో సీటు సాధించారు. విషయం తెలుసుకున్న జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ సాయి వరుణ్ నీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగ్విజయంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.గ్రామ పెద్దలు గౌని మల్లయ్య,తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, య ర్రబోయిన వెంకన్న, కోండ్రు మహేష్ సాయి వరుణ్ ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
