ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 21(నమస్తే న్యూస్).
తమ సంప్రదాయాల ప్రకారం మృతదేహాలను ఖననం చేసే ప్రజల కోసం ప్రత్యేక స్మశానవాటిక ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ సోమవారం మరిపెడ బంగ్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.ఏఐటీయూసీ,సీపీఐ నాయకులతో కలిసి ఆయన అధికారులకు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎం.డి.అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ..మరిపెడ బంగ్లా మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఉన్నప్పటికీ,తమ సంప్రదాయాల ప్రకారం ఖననం చేసే ప్రజలకు ప్రత్యేకంగా పూడ్చేందుకు తగిన స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి,ఖననం చేసే ప్రజల కోసం అవసరమైన మేరకు ప్రత్యేక స్మశానవాటికకు స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.అలాగే మరిపెడ బంగ్లా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి,అవసరమైన చోట్ల ఖననం చేసే ప్రజల కోసం ప్రత్యేక స్మశానవాటికలకు భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి కుటుంబం తమ ఆత్మీయుల అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.చివరి సంస్కారాలకు కూడా స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమస్యపై తహసీల్దార్,ఎంపీడీవో,మున్సిపల్ అధికారులు,సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.ప్రభుత్వ భూములను పరిశీలించి,ఖననం చేసే ప్రజల కోసం ప్రత్యేక స్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎం.డి.అబ్దుల్ రషీద్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,సీపీఐ నాయకులు ఈ.వీరేందర్,జి.వీరన్న, పి.నరేష్,పి.వెంకన్న, డి.నరసయ్య తదితరులు పాల్గొన్నారు..
