రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు ఇవ్వాలి.
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి.వై పుల్లయ్య , పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య డిమాండ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21 నమస్తే న్యూస్ )
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల పేరుతో సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై యు పి ఐ ఛార్జీల భారం మోపడాన్ని విరమించుకోవాలని సిపిఐ ( ఎంఎల్) మాసు లైన్ ( ప్రజా పంథా ) ఖమ్మం జిల్లా కార్యదర్శి సి వై పుల్లయ్య, పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. భవిష్యత్తు అంతా డిజిటల్ మయం, క్యాష్‌లెస్ ఎకానమీ” అని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. రూ.2,000 వరకు వసూళ్లు లేవని చెబుతున్నప్పటికీఅంతిమంగా అది ప్రజలు మరియు చిరు వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఒకవైపు బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, మరోవైపు సామాన్యులపై పన్నులు, ఛార్జీల పేరుతో భారం మోపడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, క్యూబా గాజా ప్రజలకు సంఘీభావంగా భగత్‌సింగ్ 119వ జయంతి సభను సెప్టెంబర్ 29వ తేదీన ఖమ్మంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామని ఈ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. అదేవిధంగా పాలే డివిజన్లో పిడిఎస్యు ,పి వై ఎల్, పిఓడబ్ల్యు ఆధ్వర్యంలో గ్రామాలలో విద్యాసంస్థలలో భగత్ సింగ్ జయంతి సభలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్థాపించిన సత్యశోధకు సమాజం స్ఫూర్తితో కుల పీడన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకున్న వారిని సన్మానించడం కోసం పాలేరు డివిజన్లో సభను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో రాయల వెంకటనారాయణ భవనంలో డివిజన్ నాయకుడు బానోతు శంకర్ అధ్యక్షతన జరిగినది.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు. రేపాకుల శివలింగం, కమ్మ కోమటి నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, యడ్లపల్లి నవీన్, పులుగుజు వెంకటస్వామి,అరెంపల వెంకన్న, రెంటాల యాదగిరి, పగిడి కత్తుల రామదాసు, చిర్రా బిక్షం, ఎడ్లపల్లి ఉపేందర్, కొత్తపల్లి శివయ్య తదితరులు పాల్గొన్నారు
