రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న మంత్రి: తుంబురు దయాకర్ రెడ్డి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్ )
ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డి అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో తిరుమలాయపాలెం మండలం లో వివిధ గ్రామాలకు చెందిన 114 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు 35 లక్షల 56 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తుంబురు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి వైద్యపరంగా ఎంతో భరోసా కలుగుతోందని తెలిపారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
“పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలన్నదే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా క్యాంప్ కార్యాలయం నిరంతరం పనిచేస్తుంది” అని తుంబురు దయాకర్ రెడ్డి అన్నారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అనేక కుటుంబాలకు వైద్య చికిత్స సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, కాంగ్రెస్ జిల్లా కమిటీ కార్యదర్శి ఉన్నం రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, బోల్లి కొండ రాజశేఖర్ గుమ్మడి దేవ బిక్షం కొప్పుల రాంరెడ్డి నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి మద్దులపల్లి డైరెక్టర్ జడల నగేష్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ కాంగ్రెస్ నాయకులు బత్తుల రవికుమార్, గుగ్గిళ్ల అంబేద్కర్, కర్నాటి రాజేంద్రప్రసాద్, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, మోరపాక నాగయ్య నునావత్ అశోక్ జడల రమేష్, ఫయాజ్, పుసులూరి సురేష్, అనిల్ రెడ్డి, సంఘ బత్తుల సుమన్ రెడ్డి, నందిపాటి మల్లికార్జున్ అంగిరేకుల సతీష్ లంజపల్లి శ్రీనివాస్, పొట్ల కిరణ్, గుగులోత్ సురేష్, షకీల్ పాషా, గోళ్ళ లింగన్న, తిమ్మిడి వెంకట్, సోమనబోయిన మహేష్, తవడబోయిన కృష్ణ, గూగులోత్ వీరన్న, అనిల్, షేక్ సైదా, ఇమామ్, కరీం, నల్లబెల్లి లింగన్న, జాల కిరణ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
