రైతుల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన గ్రామ సర్పంచ్.
స్పందించిన ఎమ్మెల్యే.విద్యుత్ సదుపాయం పునరుద్ధరణ.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని కందికొండ గ్రామంలో రైతులు గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం లభించింది.రైతులకు వినియోగంలో లేకుండా నిరుపయోగంగా ఉన్న విద్యుత్ పరికరం విషయాన్ని గ్రామ రైతులు సర్పంచ్ తోడుసు నాగార్జున దృష్టికి తీసుకెళ్లారు.వర్షాలు లేక,విద్యుత్ సదుపాయం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను సర్పంచ్ నాగార్జున డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే సూచనలతో అధికారులు స్పందించి 24 గంటల్లోనే రైతుల విద్యుత్ సమస్యను పరిష్కరించారు.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్‌కు,గ్రామ సర్పంచ్ తోడుసు నాగార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బయ్య శ్రీనివాస్,తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.


