మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు వాడొద్దు.
మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కూన్య తండలోని గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాధ వితరణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..గననాధుని అన్న ప్రసాధాన్ని భక్తులకు పంచితే భక్తితో పాటు ముక్తి లభిస్తుందన్నారు.ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవా కార్యక్రమమని,భక్తిశ్రద్ధలతో నిర్వహించే అన్నప్రసాధ వితరణ ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.గణనాథుని ఆశీస్సులతో భక్తులకు అన్నప్రసాధ వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు.గణేష్ ఉత్సవాల్లో భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.అనంతరం ఎస్సై గండ్రాతి సతీష్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు వినియోగించవద్దని ఉత్సవ కమిటీ సభ్యులకు,నిర్వాహకులకు సూచించారు.భక్తి,ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అన్నప్రసాధ వితరణ కార్యక్రమానికి భక్తులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను,నిర్వాహకులను చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,ఎస్సై సతీష్ అభినందించారు..

