వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 21(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉమ్మడి తానంచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని అజ్మీర తండా ప్రాంతంలో ఉన్న ఆనకట్టను పునర్మించాలని,ప్రజా పాలనపై రైతులకు భరోసా కలిపించాలని,రైతు పంటలకు నీటిని అంధించే విధంగా ఆనకట్టను త్వరతగతిన పూర్తి చేసి రైతు పంటకు నీరు అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,మరిపెడ మండల కేంద్రంలోని ప్రజావాణిలో ఎమ్మార్వో ఎంపీడీవో ని కలిసి పలు ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణిలో అధికారులకు అందచేసినట్టు తెలియజేశారు,తక్షణమే ఈ ఆనకట్టలపై సంబంధిత అధికారులతో పూర్తి విచారణ జరిపించి ఆనకట్టను పునర్నిర్మించాలని,లేనిపక్షంలో ప్రాంత రైతులని ఐకమత్యం చేసి దశలవారీగా ఉద్యమం నిర్మించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని మరో మారు హెచ్చరించారు..
