గ్రామాలలో సెప్టెంబర్ 22 నుండి 30 వరకు ప్రత్యేక క్యాంపెయిన్లు
రిపోర్టర్ :పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ..మండలంలో అగ్రి స్టాక్ రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుడుతూ “అగ్రి స్టాక్ తెలంగాణ” (Agri Stack Telangana) పథకం కింద రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐ.డి) ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐ.ఎ.ఎస్ గా ఒక ప్రకటనలో విడుదల చేశారు.ఒక రైతు – ఒక గుర్తింపు – సమగ్ర సేవలు అనే నినాదంతో ప్రతీ రైతుకు ఒక విశిష్ట ఫార్మర్ ఐ.డిని కేటాయించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.📅 రిజిస్ట్రేషన్ తేదీలు:రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక రైతు రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్లు (గ్రామ సభలు) నిర్వహించబడతాయి.
రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐ.డి) ఎక్కడ ఉపయోగపడుతుంది?
ఈ డిజిటల్ గుర్తింపు కార్డు ద్వారా రైతులకు కింది సేవలన్నీ ఒకే చోట సులభంగా లభిస్తాయి:
కనీస మద్దతు ధర కొనుగోళ్లు: వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో సులభంగా విక్రయించుకోవచ్చు.
ఎరువుల కొనుగోళ్లు: FFS (Framework for Fertilizer Sales App) ద్వారా పారదర్శకంగా ఎరువులు పొందవచ్చు.
పంట రుణాలు: బ్యాంకుల ద్వారా వేగంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట రుణాలు మంజూరవుతాయి.
ప్రభుత్వ పథకాలు & సేవలు: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, సేవలు మరియు ఇతర ప్రయోజనాలను నేరుగా పొందవచ్చు.
వ్యవసాయ సేవలు & సబ్సిడీలు: రైతు సేవలు, ఇన్పుట్ సబ్సిడీలు మరియు ఇతర వ్యవసాయ సంబంధిత సాంకేతిక సేవలు సులభతరమవుతాయి.
ఎక్కడ నమోదు చేసుకోవాలి
రైతులు తమ పరిధిలోని కింది కేంద్రాల ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు:మీ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద.లేదా మీకు సమీపంలోని మీ సేవా సెంటర్ (Mee Seva Center) లో.
కావలసిన అవసరమైన పత్రాలు
నమోదు సమయానికి రైతులు కింది పత్రాలను సిద్ధం చేసుకోవాలి
ఆధార్ కార్డు
భూమి పాస్‌బుక్ (పట్టాదార్ పాస్ బుక్)
ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
ముఖ్య గమనిక
ఇప్పటికే అగ్రి స్టాక్‌లో నమోదు చేసుకున్న రైతులు, అధికారిక పోస్టర్‌కు అటాచ్ చేసిన లింక్ (క్యూఆర్ కోడ్/వెబ్సైట్) ఓపెన్ చేసి, తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా నేరుగా తమ రైతు ఐ.డి నెంబర్ ను పొందవచ్చునని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సెప్టెంబర్ 30 లోగా తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది
