గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్ఐ కుశకుమార్
ఘనంగా సన్మానించిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ

చిన్నగూడూరు, సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్):
చిన్నగూడూరు మండల కేంద్రంలోని బోయినిబజారులో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదానానికి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణనాథుడిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్నగూడూరు ఎస్ఐ కుశకుమార్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి వరుసలో కూర్చొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎస్ఐ సాధారణ భక్తుడిలా కార్యక్రమంలో పాల్గొనడంతో భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఎస్ఐ కుశకుమార్ ను ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీ సభ్యులు
కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ కుశకుమార్కు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం మహా అన్నదానం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.అన్నదాన కార్యక్రమానికి మహిళలు, వృద్ధులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరుసల్లో అన్నప్రసాదాన్ని అందించారు. గణనాథుడి ప్రత్యేక పూజలు, మహా అన్నదానంతో బోయినిబజారు భక్తులతో సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బోయిని పెద్ద యాకన్న, మంచాల గౌరీశంకర్, బొల్లం రాము, బోయిని చిన్న యాకన్న, మాచర్ల దేవేందర్, మాచర్ల ఉదయ్, పసునది శీను, పేర్ల రాంబాబు, రత్నపురపు వీరస్వామి, కొమ్ము మల్లయ్య, షేక్ రహీం పాషా, దాసరి నరేందర్, దాసరి శ్రీను, అధికారులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


