మరిపెడ మున్సిపల్ పార్కులో పరిశుభ్రత పనులు.
పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలోని మున్సిపల్ పార్కులో శుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, పెరిగిన గడ్డిని చదును చేయడం వంటి పనులను మున్సిపల్ సిబ్బంది చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి స్వయంగా వచ్చి పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు పార్కు ఎంతో అవసరమని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనుల్లో నిమగ్నమై అలసిపోయిన పిల్లలు, పెద్దలు, వృద్ధులు సాయంత్రం వేళలో కాస్త ప్రశాంతంగా గడపడానికి, సేద తీర్చుకోవడానికి పార్కుకు వస్తారని తెలిపారు.
అలాంటి పార్కును పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పార్కులో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని, ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయవద్దని సూచించారు.
పార్కులో సువాసనలు వేదజల్లే పూల మొక్కలు పెంచాలని,అందంగా,ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
