రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, పాత్రికేయులు హాజరు కావాలని పిలుపు
రామన్నపేట, ఆగస్టు 22 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 24న సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ నిర్వహించనున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్‌రెడ్డి, బూరుగు వెంకటేశం తెలిపారు.మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్‌లోని మినీ ఫంక్షన్ హాల్లో సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1975 నుంచి 2026 వరకు సుమారు 51 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన మొహమ్మద్ ఇబ్రహీం ఉన్నత విలువలు, నిబద్ధతతో జర్నలిజాన్ని కొనసాగించారని వారు గుర్తుచేశారు.పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న సంతాప సభకు ఆయనతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అభిమానులు, మిత్రులు, తోటి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరై ఇబ్రహీంకు నివాళులర్పించాలని వారు కోరారు.

