జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 21 (నమస్తే న్యూస్)
రాజ్యాలు మారిన. రాజులు మారిన జర్నలిస్టుల ( విలేకరుల) జీవితాలు మారటం లేదని పాలకులు స్వప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రాణాలకు తెగించి రాత్రి పగలు అనకుండా ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని సిపిఐ ( ఎంఎల్ )మాస్ లైన్ అనుబంధ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏఐపీకేఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు అన్నారు.ఎన్నికలు రాగానే జర్నలిస్టులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి పబ్బం కడుపుకొని అధికారం రాగానే జర్నలిస్టు సమస్యల్ని పట్టించుకోని పాలకులు ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇండ్లు.ఇండ్ల స్థలాలు. వారి పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య. తిరగడానికి వాహనం ఏర్పాటు చేయాలని ప్రమాద బీమా సౌకర్యాల లాంటి కల్పించాలని ఈరోజు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు ప్రముఖ ప్రత్యేక సంపాదకులు. జర్నలిస్టు అమరుడు సోయబుల్లాఖాన్ గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్న జర్నలిస్టులకు ఏఐపీకేఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు జరిగే పాదయాత్రకు రాజకీయ పార్టీలు. ప్రజా సంఘాలు. కుల సంఘాలు.ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు. మేధావులు. రైతులు. వ్యవసాయ కూలీలు పాల్గొని వారి సమస్యలు పరిష్కరించే అంతవరకు అండగా ఉండాలని హక్కులు సాధించాలి తిమ్మిడి హనుమంతరావు అన్నారు.

