నర్సింహులపేట, ఆగస్టు 20 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా నర్సింహులపేట ఎస్ఐ వెంకన్న ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వెంకన్నకు మండల స్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ వెంకన్న మాట్లాడుతూ, పోలీస్ అధికారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అధికారుల ఐక్యత, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

