విద్యార్థులకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని, ఎంఈఓ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం బృందం
సిపిఐఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను
తిరుమలాయపాలెం ఆగస్టు 20 ( న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై గత పది రోజులుగా సిపిఎం సర్వే నిర్వహించడం జరిగింది . ఈ సర్వేలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం మండల ఎంఈఓ బాబు ను మెమోరనను సమర్పించారు ప్రధాన సమస్యలు మండలంలో అజ్మీర తండా జోగులపాడు వాంకుడో తండా మంగలి బండ తండా రావి చెట్టు తండా ఈ గ్రామాల్లో స్కూళ్లను మూసి వేయడం జరిగింది కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఉన్నప్పటికీ స్కూల్లు మూసివేయడం దారుణమని విద్యార్థులు ఉన్న స్కూలు అజ్మీర తండా మూసిన స్కూల్స్ ను వెంటనే పున్న ప్రారంభించి పేద విద్యార్థుల ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను డిమాండ్ చేశారు అట్లాగే విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట టీచర్ల సంఖ్యను పెంచాలని విద్యార్థులు తక్కువ ఉన్న చోట ఉపాధ్యాయులను ఎక్కువ ఉన్న స్కూళ్లకు పంపించాలని అట్లాగే మండలంలో డిప్టేషన్ పేరు మీద ఖమ్మం మిగతా చోటకి ఉపాధ్యాయుల తీసుకెళ్లడం వల్ల విద్యార్థుల అన్యాయం జరుగుతుందని వెంటనే డిప్టేషన్ రద్దుచేసి మన మండలంలో స్కూల్స్ పంపించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రధానంగా విద్యార్థులకు ఇంతవరకు స్కూల్స్ తెరిచి నెలలు కావస్తున్న యూనిఫాం పంపిణీ చేయకపోవడం అన్యాయమని వెంటనే యూనిఫామ్స్ పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అట్లాగే స్కూల్స్ లో ఆగిపోయిన బిల్డింగులను ప్రారంభించాలని స్కూల్స్లో కూలిపోతున్న పాత బిల్డింగ్లను వెంటనే తొలగించి ప్రమాదాల నుంచి విద్యార్థులు రక్షించాలని ఆయన తెలిపారు అనంతరం సమస్యలతో కూడిన మెమొరాండాన్ని ఎంఈఓకు సమర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మెరుసుల వెంకటేష్ కామల్ల సునీల్ కొమ్ము నాగేశ్వరరావు సిహెచ్ నాగన్న గోపోజి రవి పి.క్రాంతి ముత్తయ్య రాము తదితరులు పాల్గొన్నారు.

