ప్రభుత్వ విప్-ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 17)(నమస్తే న్యూస్).
మరిపెడ మండలం వెంకంపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న పార్థివ దేహానికి ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రనాయక్ మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సోమన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన రామచంద్రనాయక్,వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.యువ సర్పంచ్ ఉప్పల సోమన్న మృతి వెంకంపాడు గ్రామానికి,మండల ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.సోమన్న ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండేవారని,గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని కొనియాడారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం నుండి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రమాదానికి గల కారణాలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారఈ కార్యక్రమంలో:మరిపెడ మండల అధ్యక్షులు రవి నాయక్,మరిపెడ సర్పంచులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,గౌతమ్,బద్రు నాయక్,మాజీ మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,ప్రజాప్రతినిధులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

