వ్యవసాయ కార్మిక సంఘం రాజన్న హెచ్చరిక.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 18(నమస్తే న్యూస్).మరిపెడ మండలంలో నెలల తరబడి పెండింగ్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం తాళ్లఊకల్లు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం సీత ఎంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాజన్న మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వేలాది మంది కూలీలకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.గ్రామాల వారీగా పెండింగ్ వివరాలు:తాళ్లవౌకలు గ్రామంలో 50 మంది,ఎల్లంపేట పెద్ద చెరువు పనిచేసిన 200 మంది కూలీలకు ఒక వారం,ఎల్లంపేట మావిండ్లకుంట 15 మంది,తాళ్లవౌకలు 150 మంది,చిలంచర్ల 50 మంది,ఎడ్జర్ల 150 మంది,ఆనేపురం 150 మంది కూలీలకు నెలల తరబడి బకాయిలు ఉన్నాయని ఆయన వివరించారు.ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన 15 రోజుల్లోపే వేతనాలు చెల్లించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల కూలీలకు డబ్బులు అందడం లేదని మండిపడ్డారు.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించకపోతే కూలీలందరితో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాజన్న హెచ్చరించారు.ఈ సమావేశంలో:సంఘం మండల నాయకులు సీత వెంకన్న,పూలేపాక గణేష్,సీత బిక్షం,కొమ్ము గణేషు,పోలెపాక ఎంకన్న,సీత ఎల్లయ్య,గుండ గాని సైదులు,కొమ్ము గోపి,ఎర్ర అనిల్,పోలెపాక లచ్చయ్య,ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

