డిఎస్పీకి చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 18(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు.తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్‌తో కలిసి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన చైర్పర్సన్,ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు.ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని,వాహనదారుల భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు,రోడ్డు సైన్ బోర్డులు,రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని డిఎస్పీని కోరారు.అదేవిధంగా రాత్రి సమయాల్లో సరిపడా వీధి దీపాలు,ట్రాఫిక్ పోలీసుల నియామకం కూడా అవసరమని సూచించారు.ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ,పోలీసు శాఖల బాధ్యత అని,ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మున్సిపాలిటీ తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.డిఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జాతీయ రహదారి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో సిఐ పవన్ కుమార్,ఎస్ఐ సతీష్,మున్సిపల్ కమీషనర్ నరేష్ రెడ్డి,కౌన్సిలర్ తిరుపతి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్,కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్,షేక్ తాజోద్దీన్,జాటోతు నెహ్రు తదితరులు ఉన్నారు…

