బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మెల్యే సత్యనారాయణకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే న్యూస్): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారికి తెలంగాణ రాష్ట్ర కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భీమనాథుని సదానందం, రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీనివాస్, టీపీసీసీ సేవాదళ్ బి-గ్రేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, ఆడెపు త్యాగరాజ్ తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి, స్వీట్లు తినిపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే ప్రజాప్రతినిధిగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంతో పాటు వైద్యుడిగా తన సేవలను మరింత విస్తరించి ప్రజారోగ్య రంగానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



