Type Here to Get Search Results !

నల్లెల గ్రామంలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.

నల్లెల గ్రామంలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.



మరిపెడ/కురవి,జూన్ 11(నమస్తే న్యూస్):డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం నల్లెల గ్రామ మాజీ సర్పంచ్ గుండెబోయిన సూరయ్య సతీమణి ఉప్పలమ్మ కాలుకు శస్త్రచికిత్స చేయించుకోవడంతో గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.అదేవిధంగా గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవల ఇంటికి చేరుకున్న పోతుగంటి శ్రీనివాస్ చారి,పక్షవాతానికి గురైన కయ్యల సత్యంను వారి నివాసాల్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం ఇటీవల మరణించిన బండి వీరన్న,పొద్దుటూరి వెంకన్న మరియు వీఆర్ఏ సయ్యద్ హుస్సేన్ సతీమణి జనిబీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్,ఐలి నరహరి గౌడ్,బోడ శ్రీను నాయక్,గుగులోత్ నెహ్రూ నాయక్,పల్ల వెంకట్రాం,నరసింహారెడ్డి,పల్ల సత్తిరెడ్డి,బండి దీపక్ గౌడ్,ఉప సర్పంచ్ నిమ్మలగంటి కృష్ణమూర్తి,వార్డు సభ్యుడు ఎడ్ల ఉప్పలయ్య,అంబటి కర్ణాకర్,ధర్మారపు పుష్ప,తోట రాములు,కొండలరావు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.