Type Here to Get Search Results !

లక్ష్మారెడ్డి పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన. మాజీ మంత్రి డి ఎస్ రెడ్యానాయక్.

లక్ష్మారెడ్డి పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన.
మాజీ మంత్రి డి ఎస్ రెడ్యానాయక్.



డోర్నకల్/మరిపెడ(జూన్ 19)నమస్తే న్యూస్.

మరిపెడ మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రముఖ వ్యాపారవేత్త,సీనియర్ రాజకీయ నాయకులు దుబ్బాక లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారని తెలుసుకున్న మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,రామడుగు అచ్యుత రావు లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముఖ్య కార్యకర్తల సమావేశం



మరిపెడ బంగ్లా నవీన్ సార్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు.రాబోయే కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.మాజీ కోఆప్షన్ సభ్యులు,ఉగ్గంపల్లి సర్పంచ్ అయూబ్ పాష,13వ వార్డు కౌన్సిలర్ మహిపాల్ రెడ్డి,5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్,దిగజర్ల శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ లతీఫ్,హరి నాయక్,దిగజర్ల ముఖేష్,దుస్స నరసయ్య,బోడ రెడ్యా,నాగరాజు,గండి మహేష్,నిరంజన్ రెడ్డి,పాండు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.